ఓమన్ బౌలర్ అరుదైన రికార్డు.. బుమ్రాకి కూడా సాధ్యం కాలేదు?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక లెజెండరీ ప్లేయర్గా ఎదగాలని అనుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇక ఇలా ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయడం రికార్డులు కొల్లగొట్టడం అనేది అందరి ఆటగాళ్లకు సాధ్యమవ్వదు. కొంతమంది ప్లేయర్లో బాగా ఆడాలి అని ఆలోచనతోనే బరిలోకి దిగినప్పటికీ.. చెత్త ప్రదర్శన చేసి చివరికి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

 కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఏకంగా అత్యుత్తమ ప్రదర్శన చేసి అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా ఆటగాడు ఇలా అత్యుత్తమ ప్రదర్శన చూసాడు అంటే చాలు ఇక అందరూ అతని గురించి చర్చించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎవరైనా బౌలర్ అరుదైన రికార్డు సృష్టించాడు అంటే ఇక అతను అగ్రశ్రేణి టీం కి చెందిన ఆటగాడే అయ్యుంటాడు అని క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక అరుదైన రికార్డు క్రియేట్ అయింది  కానీ ఈ రికార్డు సాధించింది అగ్రశ్రేణి టీం కి సంబంధించిన బౌలర్ కాదు ఏకంగా చిన్న టీం అయినా ఒమాన్ దేశం తరఫున ఆడుతున్న ప్లేయర్ కావడం గమనార్హం.

 వన్డే ఫార్మాట్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ప్లేసర్గా ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 49 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత అందుకున్నాడు ఈ బౌలర్. ఆ తర్వాత స్థానంలో పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది 51 ఇన్నింగ్స్ లు, ఆస్ట్రేలియా పేపర్ మిచెల్ స్టార్క్ 52 ఇన్నింగ్స్ లో ఈ ఘనత అందుకున్న ప్లేయర్ గా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 42 వన్డే ఇన్నింగ్స్ లోనే 100 వికెట్లు సాధించిన బౌలర్గా నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే ఉన్నాడు అని చెప్పాలి. అయితే టీమిండియా బౌలర్ బుమ్రా ఈ లిస్టులో టాప్ ఫైవ్ లో లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: