రోహిత్ ఇంపాక్ట్ మామూలుగా లేదుగా.. మీరే చూడండి?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీంలలో ఒకటిగా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు.. గత కొన్ని నెలల నుంచి వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం అనేది కేవలం అందని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ప్రపంచకప్ లో బాగా రాణించడం.. కీలకమైన మ్యాచ్లలో చివరికి దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంటి బాట పట్టడం చేస్తూ వచ్చింది. అయితే ఇక ఇటీవల భారత జట్టుకు వరల్డ్ కప్ గెలవాలి అనే కల నెరవేరింది. 140 కోట్ల భారత క్రికెట్ ప్రేక్షకుల కల నెరవేరింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలపడింది.

 ఏకంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమ్ ఇండియ ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో పొట్టి ఫార్ట్ లో 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ ను ముద్దాడగలిగింది అన్న విషయం తెలిసిందే. క్షణాన్ని భారత క్రికెట్ ప్రేక్షకులు ఎవరు కూడా మర్చిపోలేరు. అయితే ఇలా టైటిల్ గెలిచిన తర్వాత ట్రోఫీని అందుకునేందుకు రోహిత్ శర్మ ఎంతో స్లోగా వాక్ చేస్తూ వచ్చిన విధానం కూడా ఇక అందరికీ తెగ నచ్చేసింది అని చెప్పాలి. ఇక ఎంతోమంది రోహిత్ శర్మను  ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేశారు.

 ట్రోఫీ అందుకోవడానికి వస్తున్న సమయంలో నెమ్మదిగా అడుగులు వేస్తూ ట్రోఫీని అందుకుని జట్టుతో పాటు రోహిత్ శర్మ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఇదే వాకింగ్ స్టైల్ ని ఫ్రీ ఫైర్ గేమ్ కూడా రిలీజ్ చేసింది. దీనిని పలువురు షేర్ చేస్తూ హిట్ మాన్ ఇంపాక్ట్ మామూలుగా లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఫ్రీ ఫైర్ విడుదల చేసిన వీడియోలో అచ్చం ట్రోఫీ అందుకునేందుకు వెళ్లిన సమయంలో రోహిత్ శర్మ ఎలా అయితే వాకింగ్ చేశాడో ఇక అలాగే వాకింగ్ చేస్తూ కనిపిస్తూ ఉండటం చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: