జడేజాను పక్కన పెట్టలేదు.. చీఫ్ సెలెక్టెర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
మొన్నటి వరకు అటు వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా మ్యాచ్లు ఆడుతూ టీమ్ ఇండియా సీనియర్లు అందరూ కూడా బిజీబిజీగా గడిపారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే శ్రీలంకతో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లబోయే మూడు ఫార్మాట్లకు సంబంధించిన టీమిండియా జట్టును ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు.

 అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే తమ అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీలను ఇక వన్డే ఫార్మాట్లో జరిగే సిరీస్ కు తప్పక ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో రవీంద్ర జడేజా పేరు ఇలా వన్డే సిరీస్ ఆడబోయే జట్టులో లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో టి20 ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజాను ఇక సెలక్టర్లు వన్డేలకు కూడా పూర్తిగా దూరం పెట్టేశారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. t20 లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే వన్డేలకు ఎలా దూరం పెడతారు అంటూ కొంతమంది అభిమానులు విమర్శలు కూడా చేశారు.

 అయితే ఇలా శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు రవీంద్ర జడేజాన్ ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించారు. శ్రీలంక టూర్ తర్వాత భారత్ 10 టెస్టులు ఆడాల్సి ఉంది. అన్ని టెస్టుల్లోను విజయం సాధిస్తామనే నమ్మకంతోనే ఉన్నాము. అందుకే మాకు అత్యంత కీలకమైన ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కు విశ్రాంతి ఇచ్చాము. అతనికి జట్టు నుంచి పక్కన పెట్టలేదు  కేవలం టెస్ట్ సిరీస్ కోసం విశ్రాంతి ఇచ్చాం మాత్రమే అంటూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: