మాయ చేసాడా.. మంత్రం వేసాడా.. బ్యాటర్ ఇలా బౌలింగ్ చేయడమేంటి?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తమ మాట తీరుతో ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రేక్షకుల ఊహకందని రీతిలో అద్భుతమైన ప్రదర్శన చేయడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ప్రదర్శన గురించే. అతను ఒక అత్యుత్తమ ఆటగాడు. వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్లలో అతను ఒకరు. ఒక్కసారి బ్యాట్ ఝాలిపించాడు అంటే ఇక పరుగుల వరద పారాల్సిందే.

 ఇప్పుడు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన అనగానే మరోసారి హాఫ్ సెంచరీనో లేకపోతే సెంచరినో  చేసి ఉంటాడు అనుకొనేరు. అయితే అతను అద్భుతమైన ప్రదర్శన చేసింది అతనికి అచ్చోచ్చిన బ్యాటింగ్లో కాదు ఎవరు ఊహించనీ విధంగా బౌలింగ్లో అదరగొట్టేసాడు. ఎప్పుడు బ్యాట్ తో మెరిసే ఈ ప్లేయర్ ఈసారి బాల్ తో రఫ్ ఆడించాడు. అద్భుతమైన బౌలింగ్ తో వరుసగా వికెట్లు తీసి అదరగొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వికెట్లు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు ఈ స్టార్ బ్యాట్స్మెన్. అతని ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్. అయితే అతని ప్రదర్శన చూసి స్టేడియం లో కూర్చున్న ప్రేక్షకులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు.

 ఇటీవల సోమర్ సెట్, గ్లామర్గాన్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో ఈ అరుదైన ఘటన జరిగింది. ఇటీవల సోమర్ సెట్ తో జరిగిన మ్యాచ్లో గ్లామర్గాన్ తరఫున బరిలోకి దిగిన లేబుషేన్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. అతని ప్రమాదకరమైన బౌలింగ్ చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు సైతం షాక్ లో మునిగిపోయారు. కేవలం 2.3 ఓవర్ల బౌలింగ్ లోనే లేబుషేన్ ఐదు వికెట్లు తీయడం గమనార్హం. అతని అద్భుతమైన బౌలింగ్ తో గ్లామర్గాన్ 120 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: