భార్యకు విడాకులు ఇచ్చిన పాండ్యాకు... BCCI బిగ్ షాక్?

Veldandi Saikiran
టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. మొన్న టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యాను.. సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 2023 ప్రపంచ కప్ సమయం నుంచే... నటాషా అలాగే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నారని... వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా విడాకులపై హార్దిక్ పాండ్యా కీలక ప్రకటన చేశారు.
 టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే నటాషా... విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు హార్థిక్ పాండ్యా. కొన్ని రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా....గురువారం రోజున ముంబై ని వదిలేసి నటాషా అలాగే ఆమె కుమారుడు అగస్త్య... సెర్బియా వెళ్ళిపోయారు.
దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు  కూడా కొట్టాయి. దీంతో విడాకులు కన్ఫామ్ అని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి హార్థిక్ పాండ్యా అధికారిక ప్రకటన చేశారు. దీంతో హార్దిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రస్తుతం కష్ట కాలం నడుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
 ప్రొఫెషనల్ గా టి20 కెప్టెన్సీ   పదవి హార్దిక్ పాండ్యా కు రాలేదు. ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. అంతకుముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న... హార్దిక్ పాండ్యాను దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోల్స్ నుంచి బయటపడ్డ హార్దిక్ పాండ్యా... టి20 ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడాడు.  ఆ సంతోషంలో ఉన్న హార్దిక్ పాండ్యాకు ఇప్పుడు విడాకులు పెద్ద సమస్యగా మారింది. దీంతో పాపం హార్దిక్ పాండ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడు తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: