హెడ్ కోచ్ గా గంభీర్.. ఆవిష్కాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏం చేయబోతున్నాడు? రానున్న రోజుల్లో టీం ఇండియాలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.. మరి ముఖ్యంగా సీనియర్లుగా కొనసాగుతున్న క్రికెటర్ల విషయంలో గౌతమ్ గంభీర్ వైఖరి ఎలా ఉండబోతుంది.. జట్టులో ఏదైనా విభేదాలకు గంభీర్ కారణం అవుతాడ.. లేదంటే జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించి మరింత ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్తాడా.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలే మాజీ ఆటగాడు గౌతం గంభీర్  ఇండియాకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు అనే విషయం తెలిసిందే.

 సాధారణంగానే గౌతమ్ గంభీర్ కి దూకుడు ఎక్కువ. అయితే క్రికెటర్ గా ఉన్నప్పుడు మాత్రమే కాదు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతనిలో దూకుడు తగ్గలేదు. ఐపీఎల్లో వివిధ జట్ల ఒక మెంటార్లుగా వ్యవహరించిన సమయంలో కూడా ఇతర ఆటగాళ్లతో ఎన్నో వివాదాలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక తన ఏది అనుకుంటే అది కావాలని గట్టిగానే ప్రయత్నిస్తాడు గౌతమ్ గంభీర్. అలాంటి గంభీర్ ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఇక అతను ఏం చేయబోతున్నాడు.. భారత ఆటగాళ్ళతో ఎలా మెదులుకోబోతున్నాడు అనే విషయం పైన అందరూ చర్చించుకుంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తూ ఉన్నారు.

 ఇక ఇప్పుడు ఇదే విషయం గురించి టీమ్ ఇండియా ప్లేయర్ ఆవేశ్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు ఆటగాళ్ల నుంచి 100% ప్రదర్శనను అంకిత భావాన్ని ఆశిస్తారు అంటూ ఆవేష్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు అంటూ కొనియాడాడు. ఆయన ఎక్కువ మాట్లాడరు  ఆటగాళ్లకు వారి వారి బాధ్యతలను సక్రమంగా కేటాయిస్తారు. ఏం చేయాలి అన్న విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెబుతారు అంటూ ఆవేశ్ ఖాన్ తెలిపాడు. అయితే గతంలో ఆవేష్ ఖాన్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఉన్న సమయంలో లక్నో జట్టుకు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: