ఇండియా బౌలింగ్ కోచ్ ఈయననేనా.. గంభీర్ ఏం ప్లాన్ చేశాడు?

praveen
భారత క్రికెట్ లో కొత్త శకం మొదలు కాబోతుంది. ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎన్నో ఏళ్లపాటు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు  ఇక ఆ తర్వాత రోహిత్ సారధ్య బాధ్యతలను అందుకొని ఏకంగా భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ట్రోఫీని అందించాడు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేసాడు అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ కప్ గెలిచిన వెంటనే కోహ్లీ, రోహిత్ లు రిటైర్మెంట్ ప్రకటించారు.

 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు టి20 ఫార్మాట్లో కొత్త కెప్టెన్ కొత్త కోచ్ కొత్త సిబ్బంది ఇలా అందరూ కొత్తవాళ్లు రాబోతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో అటు గౌతమ్ గంభీర్ ను కొత్త హెడ్ కోచ్ గా నియమించారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక మిగతా అసిస్టెంట్ కోచ్ ల విషయంలో కూడా తానే నిర్ణయం తీసుకుంటానని తనకు నచ్చిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకుంటాను అంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ ముందు ప్రతిపాదన పెట్టాడట. ఇందుకు అటు బీసీసీఐ పెద్దలు కూడా అంగీకరించారు అని చెప్పాలి.

 దీంతో తన సపోర్టింగ్ స్టాఫ్ గా గౌతమ్ గంభీర్ ఎవరిని తీసుకుంటారు అనే విషయంపై అంతట ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే వీరిని అటు గౌతమ్ గంభీర్ కి అసిస్టెంట్లుగా నియమించబోతున్నారు అంటూ కొంతమంది మాజీ ఆటగాళ్లు పేర్లు కూడా వినిపిస్తున్నాయ్. బీసీసీఐ జహీర్ ఖాన్ పేరు యోచిస్తుండగా ఆర్సిబి, టీమిండియా మాజీ ఆటగాడు వినయ్ కుమార్ పేరును గౌతమ్ గంభీర్ పరిశీలిస్తున్నారట  వీరిద్దరూ కాకుండా సీఎస్కే మాజీ బౌలింగ్ కోచ్ బాలాజీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. దీంతో వీరిలో ఎవరు ఫైనల్ అవ్వబోతున్నారు అనే విషయంపై మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: