ఐసీసీ చైర్మన్ గా జైషా.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఇది కేవలం ఒక దేశ క్రికెట్ బోర్డు మాత్రమే కాదు  ప్రపంచ క్రికెట్ ను శాసించే ఒక మహాశక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు క్రికెట్లో మనుగడ సాగించగలడా లేదా అనే స్థాయి నుంచి బీసీసీఐ ఇక ఇప్పుడు క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదిగింది అని చెప్పాలి. ప్రపంచంలోనే రిచెస్ట్  క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ.. ఏం చెబితే ఐసిసి అది చేస్తుంది అని ఇప్పటికే ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులు అన్నీ కూడా భావిస్తూ ఉంటాయి.

 ఈ క్రమంలోనే బీసీసీఐ చెప్పిన విధంగానే ఐసీసీ కూడా ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని కొన్ని సార్లు విమర్శలు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే అటు ఐసీసీ కి విరాళాలలో అటు బీసీసీఐ నుంచి అందే మొత్తమే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఐసీసీపై బీసీసీఐ ప్రభావం ఈ ప్రతివిషయంలో ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్న జై షా ఒకవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహారాలను ఎంతో సమర్థవంతంగా చూస్తూనే.. ఇంకోవైపు ఐసీసీలో కూడా కీలక పదవిలో కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షాకు ఇక ఇప్పుడు ఒక కీలక పదవి దక్క పోతుంది అన్నది తెలుస్తోంది.

 ఏకంగా ఐసీసీ చైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉంది అని క్రిక్బజ్ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జై షా పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే జై షా పోటీ చేస్తే మాత్రం ఎదురులేకుండా తప్పకుండా ఐసిసి చైర్మన్గా ఎన్నిక అవుతారని అంచనా వేసింది క్రిక్బజ్   ఐసీసీ కార్యకలాపాలలో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఇక జై షా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు జై షా. మరి నిజంగానే రానున్న రోజుల్లో ఆయన ఐసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: