రోహిత్ నా ఫేవరెట్.. హాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు కురుస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అతను భారత జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించిన తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. మొన్నటి వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇక ఇటీవల వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఒకవైపు జట్టులోని కీలక ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ,  రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు విఫలమవుతున్న ఇక తన కెప్టెన్సీ వ్యూహాలతో జట్టును విజయతీరాలకు నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఒక్క ఓటమి కూడా లేకుండానే.. t20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో జైత్రయాత్రను కొనసాగించింది. ఇలా ఒక్క ఓటమి కూడా లేకుండానే ఫైనల్ కు చేరుకోవడం పైనల్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి కప్పు గెలుచుకోవడం చేసింది టీమిండియా  ఇలా వ్యక్తిగత ప్రదర్శన విషయంలోనే కాదు కెప్టెన్సీ విషయంలో కూడా రోహిత్ శర్మ తనకు తిరుగులేదు అని నిరూపించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ పై ప్రస్తుతం ప్రశంసలు వర్షం కురుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ క్రీడా ప్రముఖులు కూడా అతని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే రోహిత్ తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ మార్వెల్ సిరీస్ ఎక్స్ మెన్ హీరో హ్యూ జాక్ మన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని మార్వాల్ ఇండియా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను క్రికెట్ ఆటకి పెద్ద ఫ్యాన్ అంటూ జాక్ చెప్పుకొచ్చాడు. క్రికెట్లో రోహిత్ బీస్ట్ అంటూ కొనియాడాడు. కాగా జాక్ నటించిన డెడ్ పూల్ అండ్ వోల్వరీస్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది  ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: