రిటైర్మెంట్ పై.. బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచేసింది. దాదాపు 13ఏళ్ళ నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియా వరల్డ్ కప్ ని ముద్దాడ గలిగింది. ఈ క్రమంలోనే భారత జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వరల్డ్ కప్ ట్రోఫీతో  అటు టీమిండియా స్వదేశానికి కూడా చేరుకుంది. అదే సమయంలో ఇక విక్టరీ పరేడ్ కూడా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో టీమిండియాలో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

 దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఇంకోన్నాళ్లపాటు  వారు అంతర్జాతీయ టి20 లో కొనసాగి ఉంటే బాగుండేది అని కోరుకున్నారు. అయితే ఇక ఇలా కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే మరో సీనియర్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా సైతం తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో మరికొంతమంది ప్లేయర్లు కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఇలాంటి వారిలో బుమ్రా పేరు కూడా వినిపించింది. అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అనే విషయంపై అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఇటీవలే ఈ స్టార్ ప్లేయర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బుమ్రా.

 ఈ క్రమంలోనే బుమ్రా మాట్లాడుతూ తన కెరియర్ ఇప్పుడే మొదలైందని.. ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించబోను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది అంటూ పేర్కొన్నాడు. కాగా t20 వరల్డ్ కప్ లో బూమ్రా అద్భుతమైన ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అనే అరుదైన అవార్డును అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా తక్కువ ఎకానమీతో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం భారత టి20 జట్టు కెప్టెన్సి రేస్ లో ఈ స్టార్ ప్లేయర్ మొదటి వరుసలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: