భారత్ టీ20 వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే!

Suma Kallamadi
ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. సరిగ్గా 2007లో ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో టీమిండియాకు మొదటి సరిగా టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అది నటి నుండి నేటి వరకూ కూడా అందని ద్రాక్ష మాదిరి మిగిలిపోయింది. ఇటువంటి దురదృష్టకర సమయంలో పొట్టి ప్రపంచ కప్‌ను మరోసారి ఇండియాకు అందించాడు రోహిత్‌ శర్మ. దాంతో కోట్లమంది భారత క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అవును, టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించింది. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయానికి కారణమైన కొన్ని ప్రధానాంశాలు గురించి ఇక్కడ మాట్లాడుకొని తీరాల్సిందే.
ఈ టోర్నీలో దారుణంగా ఫెయిల్ అయిన విరాట్‌ కోహ్లీ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ వరల్డ్‌ కప్‌ కంటే ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ, ఎందుకనో ఈ టోర్నీ ప్రారంభం అయ్యాక ఫామ్‌ అనూహ్యంగా ఫామ్ కోల్పోయాడు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ కోహ్లీ బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ అని, ఫైనల్‌ కోసం రన్స్‌ దాస్తున్నాడంటూ ఓ సందర్భంలో పేర్కొన్నాడు. ఇక రోహిత్‌ చెప్పిన మాటలను నిజం చేస్తూ కోహ్లీ ఫైనల్‌లో విజృంభించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి నిస్సహాయస్థితిలో ఉండగా కోహ్లీ బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు కోహ్లీ. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ టీమిండియా గెలిచిందంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం అని చెప్పుకొని తీరాలి.
ఆ తరువాత భారత క్రెడిట్‌ బౌలర్లకి ఇక్కడ మార్కులు ఇవ్వాలి. ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యాలే ఈ మ్యాచ్‌ను గెలిపించడంలో చాలా కీలక పాత్రను పోషించారు. అప్పటికే క్లాసెన్‌ పిచ్చికొట్టుడు కొడుతున్నారు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బుమ్రా వేసిన బౌలింగ్‌తో మ్యాచ్‌ మలుపుతిరిగింది. 16 ఓవర్‌లో 4 పరుగులు, 18వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు ఒక వికెట్‌తో బుమ్రా మ్యాచ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పాండ్యా క్లాసెన్‌, మిల్లర్‌లను అవుట్‌ చేసి.. విజయం ఖాయం చేశాడు. ఇక చివరగా సౌతాఫ్రికాకు చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ ఓవర్లు అయిపోగా హార్ధిక్‌ పాండ్యా బంతి తీసుకున్నాడు. ఎదురగా డేంజరస్‌ బ్యాటర్‌ మిల్లర్‌ సిక్స్‌ దిశగా బాల్ ని పరుగెత్తించాడు. అలా పరుగెత్తిన బాల్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ మ్యాన్‌లా వచ్చి.. అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కట్ చేస్తే భారత్ గెలుపు ఖాయం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: