ప్చ్.. వరల్డ్ కప్ నుండి ఆ జట్టు ఔట్?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో చిన్న టీమ్స్ ఎంత అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా జట్టు అయితే సంచలన విజయాలతో టాక్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా మొదటి మ్యాచ్ లోనే అటు మాజీ ఛాంపియన్ అయినా పాకిస్తాన్ ని ఓడించి ఏకంగా అందరిని ఆశ్చర్యపరిచింది.

 ఆ తర్వాత మ్యాచ్ లలో కూడా ఇలా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ తమకు తిరుగులేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే ఏకంగా సూపర్ ఎయిట్ లో కూడా అడుగుపెట్టింది అమెరికా. ఇక ఆ జట్టు ఆట తీరు చూస్తూ ఉంటే ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే అటు అమెరికా ప్రదర్శన చూసి చివరికి సెమీఫైనల్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మొదటి మ్యాచ్ నుంచి అదరగొడుతూ వచ్చిన అమెరికా వరల్డ్ కప్  నుంచి నిష్క్రమించింది. కనీసం సెమి ఫైనల్ వరకైనా వెళ్తుంది అనుకుంటే చివరికి సూపర్ 8 దశ వరకు వచ్చి అక్కడ విజయం సాధించలేదు. చివరికి టోర్ని నుంచి తప్పుకుంది.

 ఇటీవల సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ అటు అమెరికాకు ఒక కలిసి రాని మ్యాచ్ గా మిగిలింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీ ఫైనల్ రేస్ కు దూరం అయిపోయింది ఆతిథ్య  అమెరికా టీం. దీంతో సూపర్ 8 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా యూఎస్ఏ నిలిచింది. అయితే ఇలా సూపర్ 8లో తేలిపోయిన అమెరికా జట్టు.. అటు తమ సొంత దేశంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్ లో మాత్రం అదరగొట్టింది. పాకిస్తాన్, కెనడాపై వరుసగా విజయాలు సాధించి సూపర్ 8 లో అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ టోర్ని నుండి నిష్కరించడంతో ఆ జట్టు అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: