ఆసీస్ పై ఘనవిజయం సాధించిన ఆఫ్గాన్..సెమీస్ లెక్కలు తారుమారు .. అలా జరిగితే టోర్నీ నుంచి టీమిండియా అవుట్..!

lakhmi saranya

టి20 ప్రపంచ కప్ సూపర్ 8 రౌండ్ మ్యాచులు ఎంత వుడ్ కంటంగా జరుగుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. గ్రూప్-1 లో పోటీ పడుతున్న నాలుగు జట్టులో మూడు జట్లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ఇక ముఖ్యంగా భారత్ అండ్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ పోరుగా కొనసాగుతుంది. జూన్ 25వ తేదీన జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమ్ ఇండియా నేరుగా సెమీ ఫైనల్స్ కి చేరుకుంటుంది. ఒకవేళ కనుక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు కలిస్తే నెట్ రన్ లెక్కల్లోకి వస్తుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగు పాయింట్లతో +2.425 నెట్ రన్ రేట్ తో ఉంది.‌ రెండో స్థానంలో ఉన్నాం ఆస్ట్రేలియా రెండు పాయింట్లతో + 0.223 నెట్ రన్ రేట్ తో ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు పాయింట్ల నెట్ రన్ రేట్ -0.650 తో మూడో స్థానంలో ఉంది.
ఇక రెండు మ్యాచులు ఓడిన బంగ్లాదేశ్-2.489 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో నిలిచింది. భారత జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడిస్తే నేరుగా సెమి ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడితే ఆఫ్గానిస్థాన్ జట్టు ఫలితం కోసం టీమిండియా వేచి చూడక తప్పదు. ఒకవేళ భారత్ ఆస్ట్రేలియాను ఓడిస్తే బంగ్లాదేశ్ పై విజయం సాధించి అస్థానిస్తాన్ సెమీ ఫైనల్స్ కు చేరుకొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును ఓడించి మంచి నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిస్తే కనుక ఆఫ్గానిస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ ద్వారా భారత జట్టును అధిగమించి సెమీఫైనల్కు చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాపై టీం ఇండియా గోరంగా ఓడిపోతే ఆఫ్గానిస్తాన్ జట్టు సెమీఫైనల్ కి చేరే అవకాశాలు పెరుగుతాయి.
ఎందుకంటే సూపర్-8 రౌండ్ చివరి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ అండ్ బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. దీని బట్టి అఫ్గానిస్తాన్ చెట్టు ఎన్ని పరుగులతో గెలుపొందాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఇక దీని ద్వారా ఆఫ్గానిస్తాన్ జట్టు భారత్ లేదా ఆస్ట్రేలియా జట్టును అధిగమించి నెట్ రన్ రేట్ ద్వారా సెమీఫైనల్ కి చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆస్ట్రేలియా పై టీం ఇండియా ఓడిపోయే పరిస్థితి వస్తే నెట్ రన్ రేట్ తప్పకుండా చూసుకోవాలి. ఆస్ట్రేలియా పై భారత్ జట్టు కలిస్తే నేరుగా సెమిస్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఒకవేళ కనుక ఆసీస్ పై టీమిండియా ఓడిపోయే పరిస్థితిని ఎదుర్కొంటే అవమానకరమైన ఓటమిని తప్పించుకోవాలి. దీని ద్వారా అఫ్గానిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించవచ్చు. మొత్తానికి తదుపరి మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ తో భారత్ ఓడిపోతే టి20 ప్రపంచ కప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: