ప్చ్.. టీమిండియాలో మరోసారి ఫ్లాప్ స్టార్ కి అవకాశం?

praveen
వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ లో అటు భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యుఎస్ లో ఉండే స్లో పిచ్ లపై రాణించలేక మహా మహా జట్లు ఓటములు చవిచూస్తుంటే భారత్ మాత్రం ఇక ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లలో అద్భుతంగా రాణించి విజయాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు అందుకున్న టీమిండియా.. సూపర్ 8 లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 అయితే సూపర్ 8లో భాగంగా మొదట ఆఫ్ఘనిస్తాన్  తొ జరిగిన పోరులో 47 పరుగులు తేడాతో విజయం సాధించింది. కాగా 24 గంటలు తిరగక  ముందే ఇక సూపర్ 8 లాంటి కీలకమైన దశలో మరో పోరుకు సిద్ధమైంది టీం ఇండియా. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది అంటే నేరుగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. కాగా బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్లో టీమిండియాలో పలు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బంగ్లాదేశ్తో మ్యాచ్లో కూడా బరిలోకి దిగింది.  ఓపనర్ గా కోహ్లీ విఫలమవుతుండడంతో అతన్ని మూడో స్థానంలోకి మారుస్తారని.. యశస్వి జైష్వాళ్ ను ఓపినర్ గా తుది జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అలాంటి మార్పులు ఏమి జరగలేదు. అయితే లోయర్ ఆర్డర్లో వరుసగా విఫలమవుతున్న శివం దూబేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు టీం ఇండియాకు ఉపయోగపడేలా అతను ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దీంతో అతనిపై వేటు తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి ఈ ప్లాప్ స్టార్ కి జట్టులో అవకాశం కల్పించారు  దీంతో అతను ఎలా రాణిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: