టి20 చరిత్రలో.. టీమిండియా అరుదైన రికార్డు?

praveen
ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ టోర్నీలలో గత కొంతకాలం నుంచి టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతున్నప్పటికీ కీలకమైన మ్యాచులలో మాత్రం టీమిండియా కు అస్సలు అదృష్టం కలిసి రావడం లేదు. దీంతో ఇక నాకౌట్ మ్యాచ్ లలో  ఓడిపోయి చివరికి టైటిల్ను గెలవలేక పోతుంది భారత్. అయితే ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్లో మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ని ముద్దాడాలి అనే కలతోనే బరిలోకి దిగింది.

 గత ప్రపంచ కప్లలో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇక ప్రతి మ్యాచ్ లో కూడా విజయ డంకా మోగిస్తూ వచ్చింది. లీగ్ దశలో నాలుగు మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధించిన టీమిండియా.. ఇక ఇటీవల సూపర్ 8 లో భాగంగా జరిగిన కీలకమైన పోరులోనూ విక్టరీని రిపీట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 47 పరుగులు తేడాతో ఘన విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ పోరులో మరింత ముందుకు దూసుకుపోయింది అని చెప్పాలి.

 కాగా ఇలా సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఏకంగా 10 మంది ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కూడా క్యాచ్ ల రూపంలో ఔట్ చేసింది టీమిండియా  అయితే టి20 ఫార్మాట్ హిస్టరీలో భారత్ ఇలా చేయడం ఇదే తొలిసారి. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా చేరో మూడు క్యాచ్ లు పట్టుకోగా.  రోహిత్ శర్మ రెండు,  హర్షదీప్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు. ఇలా ప్రత్యర్థి ఆఫ్గనిస్తాన్ జట్టులోనీ పదిమంది బ్యాట్స్మెన్లను కేవలం క్యాష్ ల రూపంలోనే ఔట్ చేయగలిగింది భారత జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: