కోచ్ పదవి కోసం.. గంభీర్ ను బీసీసీఐ అడిగిన 3 ప్రశ్నలు ఇవేనట?

praveen
ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కూడా హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్ తో కొంత కాలం పాటు హెడ్ కోచ్గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారు. కానీ పూర్తిస్థాయిలో రెండోసారి హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం అటు గౌతమ్ గంభీర్ సుముఖంగా లేడు అన్న విషయం అర్థమైంది. దీంతో బీసీసీఐ పెద్దలకు టీమిండియాకు కొత్త హెడ్ కోసిన వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పటికే ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటన కూడా విడుదల చేసింది.

 ఈ క్రమంలోనే ఇక భారత జట్టుకు హెడ్ కోచ్గా దరఖాస్తు చేసుకున్నది వీళ్లే అంటూ కొంతమంది పేర్లు తెరమీదకి వచ్చాయి. అయితే వీరందరిలో టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ భారత నెక్స్ట్ హెడ్ కోచ్ గా సెలెక్ట్ అయ్యాడని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు హెడ్ కోచ్ కు సంబంధించిన ఎంపిక జరుగుతుందని.. దీనిపై బీసీసీఐ పెద్దలు దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారంటూ ఇప్పుడు మరికొన్ని వార్తలు వస్తున్నాయి.

 ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న గంభీర్ ని కూడా బీసీసీఐ పెద్దలు ఇంటర్వ్యూ చేశారట. ఈ క్రమంలోనే గంభీర్ ను ఏకంగా ఇంటర్వ్యూలో మూడు ప్రశ్నలు అడిగారు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. 45 నిమిషాల ఇంటర్వ్యూలో మూడు కీలకమైన ప్రశ్నలను సంధించారట.
 1.టీం కోచింగ్ స్టాఫ్ కు సంబంధించి మీ ఆలోచన ఏంటి?
2. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు జట్టు ఎంపిక మీరు ఎలా చేస్తారు?
3. మూడు ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లు, వర్క్ లోడ్, ఇక ఐసిసి ట్రోఫీ గెలవక పోవడానికి కారణమేంటి?
 ఇలాంటి ప్రశ్నలనే అటు బీసీసీఐ పెద్దలు అటు గౌతమ్ గంభీర్ ని ఇంటర్వ్యూలో అడిగారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: