అంచనాల్లేకుండా వచ్చి.. అద్భుతమే చేస్తున్నారు?

praveen
ఐసీసీ ఎప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ కప్ టోర్ని ప్రారంభమైంది అంటే చాలు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంటుంది అని చెప్పాలి. కాగా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ గా కొనసాగుతున్న జట్లలో ఏదో ఒక టీమ్ టైటిల్ విజేతగా నిలుస్తుందని నిపుణులు అందరూ కూడా అంచనా వేస్తూ ఉంటారు.

 అయితే అదే ప్రపంచ కప్ టోర్నీలో కొన్ని చిన్న టీమ్స్ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కేవలం అగ్రశ్రేణి టీమ్స్ మధ్య మాత్రమే ఉంటుందని అంచనా వేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ టోర్నీలో కూడా ఇదే అనుకున్నారు. ఇక ఇప్పటికే ఛాంపియన్గా నిలిచిన ఏదో ఒకటి మరోసారి టైటిల్ ఎగరేసుకుపోతుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పెద్ద జట్లు చెత్త ప్రదర్శన చేస్తూ ఉంటే.. చిన్న టీమ్స్ మాత్రం అదరగొట్టేస్తూ ఉన్నాయి. అంచనాలకు మించి రాణిస్తూ ఏకంగా ఛాంపియన్ జట్లకు సైతం షాక్ లు ఇస్తూ ఉన్నాయి చిన్న టీమ్స్.

 ఇలా టి20 వరల్డ్ కప్ మొదలు కావడానికి ముందు యుఎస్ఏ, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లు కనీసం పోటీలో ఉంటాయని కూడా ఎవరు భావించలేదు. అలాంటిది వీటిలో అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటికే ఛాంపియన్ టీం సైతం ఓడించి సూపర్ 8 కి దూసుకువెళ్లాయి. అదే సమయంలో ఈ వరల్డ్ కప్ లో అరవీర భయంకరమైన సౌతాఫ్రికా జట్టును నేపాల్ లాంటి చిన్న టీం దాదాపు ఓడించినంత పని చేసేసింది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి ఛాంపియన్ టీమ్స్ ఉన్న గ్రూప్ బిలో స్కాట్లాండ్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. దీంతో చిన్న టీమ్స్ అయినా ఈ జట్లు కసితో ఆడుతున్నాయని క్రికెట్ విశ్లేషకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: