T20 WC : సూపర్ 8లో.. భారత్ను ఢీకొట్టే జట్లు ఇవే?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమ్ ఇండియా గత కొంతకాలం నుంచి మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ టోర్నీలలో లీగ్ దశలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం తడబడుతుంది. దీంతో టైటిల్ పోరులో వెనకబడిపోతూనే ఉంది. ఇక గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అయితే తప్పకుండా టీమిండియా టైటిల్ గెలుస్తుంది అనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది. కానీ అప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి చివరికి నిరాశపరిచింది.

 అయితే ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం తప్పకుండా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది టీమ్ ఇండియా.. ఈ క్రమంలోనె అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ఇక ఇప్పటికే ఎక్కువ పాయింట్లతో సూపర్ 8 కి అర్హత సాధించింది అని చెప్పాలి. అయితే సూపర్ 8 లో టీమిండియా ఏ ఏ జట్లతో మ్యాచ్ ఆడబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు.

 సూపర్ 8 ఫైట్ లో భాగంగా భారత జట్టు ఏకంగా మూడు టీమ్స్ తో తలబడబోతుంది అని చెప్పాలి. వీటిలో కనీసం రెండు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా జరిగినప్పుడే సెమి ఫైనల్ బెర్తు ఖరారు అవుతుంది అని చెప్పాలి. అయితే సూపర్ 8లో భాగంగా భారత జట్టు తొలి మ్యాచ్ ఈనెల 20వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోతుంది అని చెప్పాలి. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలబడబోతుంది టీమ్ ఇండియా. మరోవైపు సూపర్ 8లో చివరగా జూన్ 24వ తేదీన గత ఏడాది వరల్డ్ కప్ ఫైనల్లో తమను ఓడించి టైటిల్ ఎగరేసుకు పోయిన ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: