కప్పడానికి కవర్లే లేవు.. అక్కడ మ్యాచ్ అవసరమా : గవాస్కర్

praveen
ప్రస్తుతం యుఎస్ఏ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయ్ అన్న విషయం తెలుస్తుంది. అయితే అన్ని టి20 మ్యాచ్ లలో లాగా   ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీలోని లీగ్ మ్యాచ్ లలో పెద్ద పెద్ద స్కోరు నమోదు చేయలేకపోయాయి ఏ జట్టు కూడా. దీంతో లో స్కోరింగ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా వరల్డ్ కప్ లోని మ్యాచ్ లన్ని ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా మరోవైపు అటు వర్షం ఎప్పటికప్పుడు అంతరాయం కలిగిస్తూనే ఉంది.

 ఇప్పటికే వర్షం కారణంగా వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడం కొన్ని టీమ్స్ భవితవ్యాన్ని దెబ్బతీసింది. ఏకంగా సూపర్ 8 కి వెళ్లకుండా చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి కారణమైంది అని చెప్పాలి. అయితే ఇటీవల టీమిండియా ఆడిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. కెనడా, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. వర్షంతో చివరికి అంపైర్లు మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేయడంపై టీమిండియా మాజీలు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు లేని చోట ఐసీసీ మ్యాచ్లు నిర్వహించకూడదు అంటూ ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ప్లేయర్ సునీల్ గావాస్కర్ సూచించాడు. నిన్న వర్షం తగ్గి గంటలు గడిచిన లాడర్ హీల్ స్టేడియంలో అవుట్ ఫీల్ తడిగా ఉండడంతో..  భారత్ కెనడా మ్యాచ్ రద్దు కావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ ను కవర్ చేసి మైదానాన్ని వదిలేయకూడదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఇంత డబ్బున్న అవుట్ ఫీల్డ్ తడిగా ఉందని మ్యాచ్లను రద్దు చేయడం సరికాదు అంటూ విమర్శించాడు సునీల్ గవాస్కర్. కాగా ఈ భారత మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: