హార్థిక్ పాండ్యా విడాకులు అంతా డ్రామా.. కేవలం సింపతి కోసమేనా?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏదో విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే  మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు హార్థిక్ పాండ్యా. గుజరాత్ జట్టును వదిలి ముంబై ఇండియన్స్ లోకి వచ్చి కెప్టెన్సీ చేపట్టాడు. అయితే కెప్టెన్ గా మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అతను ఎక్కడ ఆకట్టుకోలేకపోయాడు అని చెప్పాలి.

 ఏకంగా 2024 ఐపిఎల్ సీజన్ లో 14 మ్యాచ్లలో కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ని ముందుకు నడిపించిన హార్దిక్ కేవలం నాలుగు మ్యాచ్ లలో మాత్రమే విజయాన్ని అందించగలిగాడు. దీంతో హార్దిక్ పాండ్యా పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా అతనిపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ వచ్చింది  ఇలాంటి సమయంలోనే హార్దిక్ పాండ్యా గురించి అభిమానులు అందరూ షాక్ అయ్యే ఒక వార్త బయటకు వచ్చింది. అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ భార్య నటాషా తో విడాకులకు సిద్ధమయ్యాడు అనే వార్త ఇంటర్నెట్ ను ఊపేసింది.

 సోషల్ మీడియా అకౌంట్ లలో నటాషా తన పేరు పక్కన ఉన్న పాండ్యా పేరును తొలగించడమే కాకుండా హార్దిక్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా తొలగించింది. అదే సమయంలో నటాషా హార్దిక్ పాండ్య ఆస్తిలో 70% భరణం రూపంలో తీసుకోబోతుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విడాకుల వార్త తర్వాత అప్పటివరకు విమర్శలు చేసిన వారందరూ కూడా హార్దిక్ పాండ్యాపై సానుభూతి చూపించడం మొదలుపెట్టారు  అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత జట్టు కోసం ఆడుతున్న హార్దిక్ పాండ్యా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అదరగొట్టేసాడు. ఇటీవల పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా బ్యాటింగ్లో ఆకట్టుకోకపోయినా బౌలింగ్లో అదరగొట్టాడు. అయితే ఇంతలోనే సడన్ గా హార్దిక్ పాండ్యాతో పెళ్లి ఫోటోలను మళ్లీ నటాషా తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అందరు షాక్ అయ్యారు. నటాషా కావాలనే ఇలా విడాకులు వార్తలు క్రియేట్ అయ్యేలా చేసిందని.. హార్దిక్ పై ఉన్న నెగెటివిటీ పోయేందుకే విడాకుల డ్రామా అని.. కేవలం సింపతి కోసమే అని కొంతమంది చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: