ఎప్పుడు ఇలా జరగుండదు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన?

praveen
మొన్నటి వరకు భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన 2024 ఐపీఎల్ సీజన్లో ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. మొదటి మ్యాచ్ నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన.. కోల్కతా జట్టు ఫైనల్లో అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే రీతిలో సత్తా చాటింది.

 ఈ క్రమంలోనే ఎంతో అలోకగా విజయం సాధించగలిగింది అని చెప్పాలి. దీంతో ఇక మూడోసారి ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకుంది ఛాంపియన్ కోల్కత్త జట్టు. ఈ క్రమంలోనే ఆ జట్టు ప్రదర్శన పై ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అన్ని విభాగాల్లో రాణించిన కోల్కతా జట్టు టైటిల్ గెలవడానికి సరైన అర్హత కలిగిన జట్టు అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు అందరు కూడా అభివర్ణిస్తున్నారు. ఇక అటు కోల్కతా జట్టు అభిమానుల ఆనందానికి అయితే అవదులే లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఒక ఆసక్తికర విషయం కాస్త సోషల్ మీడియాలోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.

 ఎందుకంటే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించగా అటు క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘటన జరిగింది. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సన్రైజర్స్ వర్సెస్ కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇక అంతకుముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అనేక సారూప్యతలు ఉండడం గమనార్హం. రెండు మ్యాచ్ ల్వలో కూడా చేజింగ్ చేసిన జట్లే విజేతగా నిలిచాయ్. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆల్ అవుట్ అవ్వగా యాదృచ్ఛికంగా చేజింగ్ చేసిన టీమ్స్ ఎనిమిది వికెట్లు తేడాతో విజయం సాధించాయి. ఓడిన చెట్ల కెప్టెన్లు ఆస్ట్రేలియా ప్లేయర్లు కాగా.. గెలిచిన జట్ల సారథులు ఇండియా ప్లేయర్లు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: