SRH ను భయపెడుతున్న చెపాక్.. అక్కడ అన్ని ఓటములే?

praveen
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో అంచనాలకు మంచి రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక నేడు డూ ఆర్ డై  మ్యాచ్ ఆడపడుతుంది. లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన సన్రైజర్స్ కు మొదటి అడుగులోనే ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగిన సన్రైజర్స్ ఇక మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా ఇక పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేసి ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశ చెందారు. అయితే ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తో నేడు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతుంది. చెన్నైలోనే చపాతి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. దీంతో ఇక సన్రైజర్స్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది  ఇక తమ అభిమాన జట్టు తప్పకుండా గెలవాలని అటు తెలుగు క్రికెట్ అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలోనే అటు చపాక్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను ఇక ఇప్పుడు చెపాక్ స్టేడియంలో ఉన్న ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న ఈ స్టేడియంలో.  సన్రైజర్స్ ఒక చెత్త రికార్డు ఉంది. ఇప్పుడు వరకు ఇక్కడ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్లు ఆడగా.. ఎనిమిదింటిలో కూడా ఓడిపోయింది. ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ డ్రాగ ముగిసింది. ఇలా ఒక రకంగా చెప్పాలంటే చెపాక్ స్టేడియంలో సన్రైజర్స్ కి ఒకసారి కూడా కలిసి రాలేదు. అయితే ఈ సెంటిమెంట్ను కమిన్స్ సేన బ్రేక్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: