చాహల్ హిస్టరీ క్రియేట్ చేసేవాడు.. కానీ కొద్దిలో మిస్?

praveen
ప్రస్తుతం హోరా హోరీగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఇక కొన్ని టీమ్స్ అంచనాలకు మించి రాణిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి జట్లలో రాజస్థాన్ రాయల్స్ టీం కూడా ఒకటి. మిగతా టీమ్స్ లాగా ఈ టీం పై పెద్దగా అంచనాలు లేవు. ఎప్పటి లాగానే ఐపిఎల్ లోకి వచ్చి కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయి.. ఇంకోన్ని మ్యాచుల్లో గెలిచి ఇక ప్లే ఆఫ్ కి చేరకుండానే నిష్క్రమిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఛాంపియన్ టీమ్స్ ని సైతం వెనక్కి నెట్టి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ అదరగొడుతుంది. సంజు శ్యాంశాన్ కెప్టెన్సీలో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. పంజాబ్ కింగ్స్ ని తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. అయితే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కి ముందు ఆ జట్టు బౌలర్ చాహాల్ ను ఒక అరుదైన రికార్డు ఊరించింది. పంజాబ్ తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఉంటే.. ఏకంగా ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించేవాడు.

 కానీ ఇక ఈ సరికొత్త రికార్డు నెలకొల్పడానికి చాహాల్ కేవలం రెండు వికెట్ల దూరంలో ఆగిపోయాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్.. కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు  కాగా ఇక తన బౌలింగ్లో 31 పరుగులను ఇచ్చుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక 200 వికెట్ల మైలురాయిని అందుకునే ఛాన్స్ ని మిస్ అయ్యాడు  ఇప్పటికే రెండు 198 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా టాప్ లో ఉండగా... ఆ తర్వాత స్థానంలో బ్రావో 183, చావ్లా 181,  అమిత్ మిశ్రా 173, భువనేశ్వర్ 173, అశ్విన్ 172 వికెట్లతో ఉన్నారు. అయితే ప్రస్తుతం బ్రావో తప్ప మిగతా అందరూ కూడా క్రికెట్ ఆడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: