చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ అందరికీ మించిన తోపు ప్లేయర్ ఎవరు అంటే అందరూ టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరే చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన ఆట తీరుతో వరల్డ్ క్రికెట్లో అంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు కోహ్లీ. ఏకంగా ఎంతో మంది లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలో బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు.

 ఇక నేటి రోజుల్లో రికార్డుల విషయంలో మిగతా స్టార్ ప్లేయర్లందరికీ కూడా అందనంత దూరంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఒక్కసారి టెండూల్కర్ సాధించిన 100 సెంచరీల రికార్డు మినహా అటు విరాట్ కోహ్లీ దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు ఐపీఎల్ హిస్టరీలో సైతం ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ కొనసాగుతూ ఉన్నాడు.  ఇటీవలే  రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక ఈ సెంచరీ ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు రన్ మిషన్ విరాట్.

 ఏకంగా ఐపీఎల్ హిస్టరీ లో 7500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ ఘనత అందుకున్న తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత స్థానం లో శిఖర్ ధావన్ 6755 పరుగులతో రెండవ స్థానం లో ఉన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ 6,545 పరుగులు, రోహిత్ శర్మ 6280 పరుగులు, సురేష్ రైనా 5528 పరుగులతో ఉన్నారు. ఇకపోతే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయినప్పటికీ ఇక బౌలింగ్ విభాగం విఫలం కావడంతో చివరికి బెంగళూరు జట్టు కి పరాజయం తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: