ఐపీఎల్ : ఎవరెవరా అనుకున్నాం.. అతను కోహ్లీనే?

praveen
ఎప్పటిలాగానే 2024 ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక 10 టీమ్స్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా బలిలోకి దిగాయి. దేశంలోని 10 వేదికలపై ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ అసలు సిసలైన క్రికెట్ మజానే అందిస్తుంది. ఇక కొన్ని టీమ్స్ అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తూ ఉంది. ఇంకొన్ని టీమ్స్ మాత్రం వరుస విజయాలతో టైటిల్ పోరులో దూసుకుపోతూ ఉన్నాయి.

 అయితే ఇలా మ్యాచులు అన్నీ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయ్. ఎంతోమంది బ్యాట్స్మెన్లు  విధ్వంసం సృష్టిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నారు. కానీ ఐపీఎల్ లో ఈసారి ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఎంతో మంది ప్లేయర్లు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నప్పటికీ.. భారీ ఇన్నింగ్స్ లను సెంచరీగా మలచడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు అని చెప్పాలి. దీంతో కేవలం హాఫ్ సెంచరీలతో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఐపిఎల్ సీజన్లో మొదటి సెంచరీ చేసే ఆటగాడు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆటగాడు ఎవరూ కాదు క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ అన్నది తేలిపోయింది.

 ఇటీవలి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. 72 బంతుల్లో సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండడం గమనార్హం. కోహ్లీ సెంచరీనే సూపర్ అనుకుంటే ఆ తర్వాత ఇదే మ్యాచ్లో చేజింగ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ 58 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టేశారు. ఇలా ఎవరు సెంచరీ చేస్తారు అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: