ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన క్రికెట్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ మ్యాచ్ లను ఆడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" మ్యాచ్ లను ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కోహ్లీ ప్రస్తుతం బెంగుళూరు రాయల్ చాలెంజెస్ "ఆర్ సి బి" టీం తరఫున ఆడుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన ఈ జట్టులో ఉన్న అందరి ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులను సాధించి ఫుల్ జోష్ లో ముందుకు సాగిపోతున్నాడు.
కాకపోతే కోహ్లీ తన వంతు ప్రయత్నంగా అద్భుతమైన ఆటను కనబరిస్తున్నప్పటికీ ఈ జట్టు మాత్రం విజయాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు బెంగళూరు జట్టు 2024 "ఐ పీ ఎల్" లో నాలుగు మ్యాచ్ లను ఆడగా అందులో మూడింటిలో ఓడిపోయి ఒక దాంట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చాలా కిందన ఉండిపోయింది. ఇకపోతే ఈ జట్టు గొప్ప ప్రదర్శనను ఇవ్వకపోయినప్పటికీ కోహ్లీ మాత్రం తన ప్రదర్శనతో అరుదైన రికార్డు లను దక్కించుకుంటున్నాడు.
అందులో భాగంగా తాజాగా కూడా కోహ్లీ మరో అరుదైన రికార్డు ను దక్కించుకున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... ఒకే వేదికపై 100 టీ 20 మ్యాచ్ లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు ను సృష్టించారు. నిన్న బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో లక్నో తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇక కోహ్లీ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ ... వాంటెడ్ స్టేడియం లో 80 మ్యాచ్ లను ఆడగా , ధోని ... చపాక్ స్టేడియంలో 69 మ్యాచ్ లను ఆడి కోహ్లీ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు.