ధోనీకి ఇదే చివరి సీజన్.. షాకింగ్ విషయం చెప్పిన రవి శాస్త్రి?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా భారత క్రికెట్ లో ఎంతో మంది లెజెండ్స్ ఉన్నప్పటికీ తన కెప్టెన్సీ తో తన ఆట తీరుతో.. ఇండియన్ క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే అటు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ వచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీకి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.

 కానీ ధోని మాత్రం ప్రతి ఏడాది ఐపిఎల్ లో కొనసాగుతూనే వచ్చాడు. గత ఏడాది ఏకంగా ఐపీఎల్లో చెన్నై జట్టును ఛాంపియన్గా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కి ముందు మాత్రం యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ అప్పగించిన ధోని కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే రుతురాజ్ కూడా కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల టీమిండియా మాజీ ప్లేయర్ రవి శాస్త్రి స్పందించాడు. ధోని కి ఇదే చివరి ఐపిఎల్ సీజన్ అంటూ స్పష్టం చేశాడు. ధోని సీజన్ మొత్తం ఆడతారా మధ్యలోనే వీడ్కోలు పలుకుతారా అనేది అతని బాడీ సహకరించడం పై ఆధారపడి ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే అభిమానులు మాత్రం ధోని సీజన్ మొత్తం ఆడాలని కోరుకుంటున్నారు. అయితే ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ధోని బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన  తీరు అభిమానులు అందరికీ కూడా ఒక స్వీట్ మెమోరీ ని మిగిల్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: