"LSG" కి కొత్త ఉత్సాహం వచ్చేసింది... ఆ ఆటగాడు రిటర్న్..!

Pulgam Srinivas
ఇప్పటికే 2024 "ఐ పి ఎల్" లో భాగంగా 14 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు మ్యాచ్ లను ఆడింది. అందులో మొదటగా కింగ్స్ 11 పంజాబ్ జట్టుతో ఈ టీం తలపడగా ఇందులో LSG మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో ఈ టీం తలపడింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం విరు ఓడిపోయారు.


దానితో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఒక దాంట్లో ఓడిపోయి ... ఒక దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో పర్వాలేదు అనే స్థానంలో కొనసాగుతుంది.  LSG జట్టు ఆఖరిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో తలపడింది. ఈ మ్యాచ్ కి ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి కే ఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు. దానితో ఆ మ్యాచ్ కు నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.  ఈ రోజు LSG ... బెంగళూరు రాయల్ చాలెంజెస్ టీం తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల 30 కు ప్రారంభం కానుంది.


ఇకపోతే ఈ రోజు మ్యాచ్ కి కూడా కే ఎల్ రాహుల్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనితో LSG జట్టు కె ఎల్ రాహుల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఒక దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ రోజు మ్యాచ్ లో కే ఎల్ రాహుల్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. ఇలా రాహుల్ ఈ రోజు మ్యాచ్ లో ఉండబోతున్నాడు అని తెలియడంతో ఈ జట్టు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ రోజు రాహుల్ నేతృత్వంలో LSG జట్టు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: