ఇంత ఏజ్ వచ్చినా.. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి.. కారణం అదేనట తెలుసా?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ ను అభిమానించే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. కేవలం ప్రభాస్ సినిమాలను మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఎంతోమంది అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే అందరిలాగా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడి తక్కువ సినిమాలు చేసే హీరో ప్రభాస్ కాదు. ఏకంగా స్టేజి మీద సిగ్గు బిడియం తో తక్కువగా మాట్లాడి ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు.

 అయితే ప్రభాస్ తన సినిమాల విషయం కంటే పెళ్లి విషయంలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. పెళ్లి అనే మాటనే తరిదాపుల్లోకి రానివ్వని ఏకైక టాలీవుడ్ హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రూమర్స్ వినిపించాయ్ ఇది నిజం కాలేదు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇక తర్వాత కృతి సనన్ తో ప్రభాస్ పెళ్లి జరగబోతుంది అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక ఇవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. దీంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అసలు ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనే చర్చించుకుంటున్నారు.

 అయితే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసిన ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అనే విషయం మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇలా పెళ్లికి దూరంగా ఉండడానికి అసలు కారణం ఏంటి అన్నది ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు ప్రభాస్. నా ఫ్యాన్స్ నన్ను పెళ్లి చేసుకోమని పోస్ట్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆమెకు ఏమన్నా డిస్టబెన్స్ వస్తే ఫ్యాన్స్ క్లియర్ చేయలేరు కదా.. అయినా ఎందుకు ఈ పెళ్లి.. ఉన్నన్ని రోజులు నేను ఇలాగే ఉందామని అనుకుంటున్నా అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం గురించి తెలిసి ఇక ప్రభాస్ అన్న పెళ్లి చూడటం కష్టమేనా అని అభిమానులు కూడా అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: