హసరంగపై ఐసీసీ నిషేధం.. లంక బోర్డు మాస్టర్ ప్లాన్ సక్సెస్?

praveen
ప్రస్తుతం శ్రీలంక జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న హసరంగా వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల అతను అటు టెస్ట్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఇక టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకున్నాడు హసరంగా. ఏకంగా మళ్ళీ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇలా రిటర్మెంట్ వెనక్కి తీసుకున్న అతని విషయంలో ఐసిసి ఊహించని షాక్ ఇచ్చింది.

 అంతకుముందు బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో అతను ఎంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ఏకంగా అతనిపై రెండు మ్యాచ్ లపాటు నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఏకంగా టెస్ట్ క్రికెట్ రిటర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ జట్టులోకి వస్తే దురదృష్టవశాత్తు అంతలోనే ఐసిసి అతనిపై రెండు మ్యాచ్లకు నిషేధం విధించింది అంటూ అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక ఈ విషయంలో లంక క్రికెట్ బోర్డు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిందట.

 బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ అనంతరం అతను ఆడబోయే రెండు టెస్టులు లేదా నాలుగు వన్డేలు లేదంటే టి20 మ్యాచ్ లపై ఐసీసీ విధించిన నిషేధం పడుతుంది అని చెప్పాలి. అయితే బంగ్లాదేశ్ తో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది నేరుగా టి20 వరల్డ్ కప్ లోనే. దీంతో ఆ సమయంలో అతనిపై నిషేధం పడకుండా ఉండేందుకు.. లంక క్రికెట్ బోర్డు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిందట. ఈ క్రమంలోనే అతన్ని టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని చెప్పి.. ఇక చివరికి టెస్ట్ జట్టులోకి ఎంపిక చేసిందంట. తద్వారా ఇక ఐసీసీ విధించే నిషేధం ఇక రెండు టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే కొనసాగుతుంది. దీంతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను అతను ఎలాంటి నిషేధం లేకుండానే కొనసాగించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: