ఇది పద్ధతి కాదంటూ.. ఆర్సిబిపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ మొదలైంది అంటే చాలు ఇండియన్ క్రికెట్ లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతూ ఉంటారు. కొంతమంది స్టేడియం కు వెళ్లి నేరుగా మ్యాచ్ వీక్షించాలని కోరుకుంటే.. ఇంకొంతమంది ఫ్యామిలీతో కలిసి టీవీల ముందు కూర్చుని.. ఇక మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక మార్చి 22వ తేదీన అటు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ తో ఈ ఐపీఎల్ టోర్ని ప్రారంభం కాబోతుంది.

 ఇప్పటికే బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ టోర్నీలో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్నాయి అని చెప్పాలి. దీంతో ఆయా జట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను అటు జియో సినిమా ఉచితంగా ప్రసారం చేస్తూ ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 ఇలాంటి సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం చేసిన ఒక పని మాత్రం అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఆగ్రహం తెప్పిస్తుంది అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి  ముందు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఈనెల 19వ తేదీన అంటే నేడే ఆర్సిబి అన్ బాక్స్ ఈవెంట్ నిర్వహించబోతుంది. చిన్న స్వామి స్టేడియంలో ఇక ఈవెంట్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం చూడాలి అంటే 99 రూపాయలు చెల్లించాలని.. ఆ ఫ్రాంచైజీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలలో పాటు జరిగే ఐపీఎల్ టోర్నినే ఫ్రీగా ప్రసారం చేస్తుంటే.. కేవలం 6 గంటల పాటు జరిగే ఈవెంట్ కోసం డబ్బులు వసూలు చేయడం ఏంటి అని ఆర్సిబి పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: