
కోహ్లీ ఉండాల్సిందే.. విరాట్ కు మద్దతుగా రోహిత్?
కోహ్లీ లేకుండా టీమిండియా వరల్డ్ కప్ ఆడటం ఏంటి అయినా.. కోహ్లీ లాంటి ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం ఏంటి అని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ విరాట్ కోహ్లీ లేకుండా.. టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని.. అందుకే అతని తప్పకుండా జట్టులో కొనసాగించాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంలో విరాట్ కి మద్దతుగా నిలుస్తున్నాడు అన్నది తెలుస్తుంది. విరాట్ కోహ్లీని తప్పించాలని అటు బీసీసీఐ పెద్దలు ప్రయత్నిస్తూ ఉండగా.. అటు కెప్టెన్ రోహిత్ మాత్రం కోహ్లీ తప్పకుండా జట్టులోనే ఉండాలని అతనికి మద్దతుగా నిలుస్తూ పట్టుబడుతున్నాడట రోహిత్.
జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ భారత జట్టులో ఉండాల్సిందే అని బీసీసీఐ పెద్దలతో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం చర్చలు జరుపుతూ ఉన్నాడట. మరి సెలక్టర్లు కెప్టెన్ రోహిత్ మాట విని విరాట్ కోహ్లీని జట్టులోనే కొనసాగిస్తారా లేదా ముందు నుంచి అనుకున్నట్లుగా విరాట్ ను తప్పించి అతని స్థానంలో ఇషాన్ కిషన్ మీ ఆడిస్తూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఏం జరగబోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..