గుజరాత్ జట్టుకు మరో బిగ్ షాక్.. రూ. కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ దూరం?

praveen
ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు ఛాంపియన్గా అవతరించింది అన్న విషయం తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తిరుగులేని టీం గా ప్రస్తానాన్ని కొనసాగించింది. వరుసగా రెండు సీజన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడిన గుజరాత్ మొదటి సీజన్లో టైటిల్ విజేతగా.. ఇక రెండో సీజన్లో రన్నరప్ గా నిలిచింది అని చెప్పాలి.  అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు మాత్రం అటు గుజరాత్ టైటాన్స్ జట్టుకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

 మొదట్లోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా ఏకంగా జట్టును వదిలేసాడు. తన హోమ్ టీం అయినా ముంబై జట్టులోకి వెళ్లి అక్కడ ఆ జట్టు కెప్టెన్సీ ని చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్సీ లో ఎలాంటి అనుభవం లేని యువ ఆటగాడు గిల్ చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక మరోవైపు ఇక గుజరాత్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న మహమ్మద్ షమి గాయం నుంచి కోలుకోకపోవడంతో.. ఐపీఎల్ టోర్ని మొత్తానికి దూరమయ్యాడు. ఇక షమి లేని గుజరాత్ ఎలా రాణిస్తుందో అనే విషయంపై కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
 ఇలాంటి సమయంలో అటు గుజరాత్ టైటాన్స్ జట్టుకి మరో బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది. ఎందుకంటే ఆ జట్టు యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే బైక్ ప్రమాదంలో గాయపడిన ఈ ఆటగాడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ మొత్తానికి కూడా అతను దూరమైనట్లు  కోచ్ ఆశిష్ నెహ్ర చెప్పుకొచ్చాడు. అయితే అతను ఆట తీరుకు ఫిదా అయిన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఏకంగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో 3.4 కోట్ల భారీ ధర పెట్టి ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది  కానీ ప్రస్తుతం అతను అందుబాటులో లేకుండా పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: