నేను నేనే.. నన్ను ధోనితో పోల్చొద్దు : జురెల్

praveen
భారత క్రికెట్ హిస్టరీలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో ఎంతోమంది లెజెండ్స్ కూడా ఉన్నారు. కానీ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నా.. అటు లెజెండరీ ప్లేయర్గా గుర్తింపును సంపాదించుకున్న మహేంద్రసింగ్ ధోనీ మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అందరని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ట్రోఫీని రెండుసార్లు అందించిన ఘనత కేవలం మహేంద్ర సింగ్ ధోనికే దక్కుతుంది.

 ఇక తాను సారధిగా ఉన్న సమయంలో భారత జట్టు ఆసామాన్యమైన విజయాలను సాధించి ఏకంగా వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతలా తన కెప్టెన్సీ తో ప్రత్యేకమైన ముద్ర వేశాడు మహేంద్రసింగ్ ధోని  కేవలం కెప్టెన్సీ తో మాత్రమే కాదు.. ఇక తన ఆట తీరుతోను వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అని చెప్పాలి. బెస్ట్ వికెట్ కీపర్ గా, బెస్ట్ ఫినిషర్ గా, బెస్ట్ కెప్టెన్ గా ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లో ధోని తన బెస్ట్ ను ఇచ్చి లెజెండ్ గా ఎదిగాడు. అయితే ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి ఇక మిడిల్ ఆర్డర్లో మంచి ప్రదర్శన చేశారు అంటే చాలు వారిని ధోనీతో పోల్చడం చేస్తూ ఉంటారు మాజీ ప్లేయర్లు.

 అయితే ఇటీవల ఇంగ్లాండు, టీం ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసి అద్భుతంగా రానించిన యువ ఆటగాడు దృవ్ జురెల్ నీ మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మహేంద్రసింగ్ ధోనితో పోల్చాడు. అయితే ఇలా ఎందుకు పోల్చాల్సి వచ్చింది అనే విషయంపై వివరణ కూడా ఇచ్చాడు. కాగా ఇక ఇదే విషయంపై ఇటీవలే దృవ్ జూరల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నన్ను ధోనీతో పోల్చినందుకు చాలా థాంక్స్ గవాస్కర్ సార్. కానీ ధోని సాధించిన వాటిని ఎవరు పునరావృతం చేయలేరు. ఈ విషయాన్ని నేను వ్యక్తిగతంగా బలంగా నమ్ముతాను. ఎప్పటికీ ధోని లాంటి వారు ఒక్కరు మాత్రమే ఉంటారు  అందుకే నేను ధ్రువ్ జూరెల్ గా మాత్రమే ఉండాలని అనుకుంటున్నాను అంటూ యువ ఆటగాడు చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: