అతనికోసం అన్ని కోట్లు పెట్టాలా.. పాక్ క్రికెట్ బోర్డుపై ఫ్యాన్స్ ఆగ్రహం?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కేవలం పాకిస్తాన్ క్రికెట్లో మాత్రమే కాదు ఆ దేశంలో కూడా ఆర్థిక సంక్షోభం నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనీసం ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఏకంగా స్టార్ ప్లేయర్లు సైతం ఇక తమ వేతనాల కోసం అటు క్రికెట్ బోర్డు పెద్దలను వేడుకుంటున్న ఫోటోలు వీడియోలు గతంలో వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతూ ఉండగా మరోవైపు.. ఇక జట్టుకు కొత్తగా కెప్టెన్లను నియమించడం.. ఇక కోచింగ్ సిబ్బంది లో కూడా మార్పులు చేయడం.. ఇలా ఇక ఎన్నో అనుభయమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి కోచ్ లేకుండానే వరుసగా మ్యాచ్లు ఆడుతుంది. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన షైన్ వాట్సన్ ను అటు పాకిస్తాన్ జట్టుకి హెడ్ కోచ్ గా  నియమించింది.

 అయితే ఈ విషయంపై అటు పాకిస్తాన్ క్రికెట్ ఫాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి షెన్ వాట్సన్ లాంటి అనుభవజ్ఞుడిని ఇక హెడ్ కోచ్ గా నియమించడం మంచిదే కదా అంటారా.. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో ఉన్న పరిస్థితుల దృశ్య అతనికి చెల్లిస్తున్న మొత్తం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇక క్రికెటర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా 15 కోట్ల రూపాయలు కుమ్మరించి మరి ఆస్ట్రేలియా మ్యాజిక్ ప్లేయర్ షేన్ వాట్సన్ ను కోచ్ గా నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన సీనియర్లు కోచింగ్ కు పనికిరారా అంత ఖర్చు పెట్టి విదేశీ కోచ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pcb

సంబంధిత వార్తలు: