యాక్సిడెంట్ సమయంలో.. రిషబ్ పంత్ అలా అనడంతో షాక్ అయ్యాం : డాక్టర్స్

praveen
ప్రస్తుతం ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ గురించి హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేసేందుకు.. భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ గురించే చర్చ జరుగుతుంది. ఈసారి ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయబోయే టీం ఏది అని కొంతమంది.. ఇక టైటిల్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అని మరి కొంతమంది ఇక రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

 ఇలాంటి రివ్యూలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ని కెప్టెన్ గా ముందుకు నడిపించబోతున్నాడు అని చెప్పాలి. అయితే అతని రీఎంట్రీ గురించి కూడా భారత క్రికెట్లో చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అతను పూర్తిస్థాయిలో కోలుకొని ఇక జట్టుకు పూర్తిగా అందుబాటులో ఉంటాడా లేదంటే మళ్లీ పాత గాయం వేధిస్తే ఇక ఐపీఎల్ టోర్నికి దూరమవుతాడా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది  అయితే యాక్సిడెంట్ సమయంలో అతనికి తగిలిన తీవ్రమైన గాయాల గురించి ఇటీవల అతనికి చికిత్స చేసిన వైద్యులు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

 క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకోవడం నిజంగా అద్భుతం అంటూ అతనికి చికిత్స అందించిన డాక్టర్లు తెలిపారు  2022లో యాక్సిడెంట్ తర్వాత  ముంబైలోని కోకిల ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. అయితే రోడ్డు ప్రమాదంలో అతని మోకాళ్ళలో పాడు అవ్వని బాగమంటూ ఏదీ లేదు. 18 నెలల వరకు కనీసం నడవడం కూడా కష్టమే అని మేము అతనితో చెప్పాము. కానీ ఏడాదిలోపే నడుస్తాను అని అతను చాలెంజ్ చేశాడు. అదే చేసి చూపించాడు. రిషబ్ పంత్ కాన్ఫిడెన్స్ చూసి మేమె షాక్ అయ్యాం అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: