ధోని డీజిల్ ఇంజన్ లాంటోడు.. డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో తన కెప్టెన్సీ తో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఎంతోమంది క్రికెట్ లవర్స్ గుండెల్లో చెరగని ముద్రణ వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని.. ఇక అప్పటినుంచి ఐపీఎల్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

 అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని ఐపిఎల్ కెరీర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ప్రతి సీజన్ సమయంలో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కానీ అటు మహేంద్రుడు మాత్రం ప్రతి సీజన్లో కొనసాగుతూనే వస్తున్నాడు. ఇక గత ఏడాది అయితే తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మరోసారి టైటిల్ కూడా అందించాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ మరోసారి వార్తలు మీదికి వచ్చాయి.

 ఇక ఇదే విషయం గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ ప్లేయర్ ఏబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేంద్రసింగ్ ధోని ఓ డీజిల్ ఇంజన్ లాంటివాడు అంటూ ఏబి డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. ధోని గత ఏడాది రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. ఈ సీజన్లో ఆడతాడు. ఇదే ఆయనకు ఆఖరి సీజనా అంటే అది కూడా ఎవరికి తెలియదు. డీజిల్ ఇంజన్ లాగా ఆయన పనిచేస్తూనే ఉంటారు. అతను ఒక అద్భుతమైన ఆటగాడు. ఒక గొప్ప సారథి. అతని సారథ్యంలోని  చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడటం అంత సులభమైన విషయం కాదు అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: