టి20 టోర్నిలో డబ్బు కోసం.. ఆ క్రికెటర్ పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడట?

praveen
ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే మిగతా ఫార్మట్లను పక్కనపెట్టి మరి పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడటానికి అటు ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు ఆడటం కంటే అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 టోర్నీలలో భాగం కావడానికి స్టార్ క్రికెటర్లు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. దీనికి కారణం ఇక ఆయా టి20 లో పాల్గొంటే వచ్చే భారీ ఆదాయమే కావడం గమనార్హం.

 సాధారణంగా అయితే అంతర్జాతీయ టి20 మ్యాచ్లలో పాల్గొంటే కేవలం లక్షల్లో మాత్రమే ఇక మ్యాచ్ ఫీజు దక్కుతూ ఉంటుంది. కానీ అదే వివిధ దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టి20 టోర్నలలో పాల్గొంటే.. ఏకంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు. అంతకుమించిన పేరు ప్రఖ్యాతలు, అనుభవం కూడా వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక జాతీయ జట్టుకు ఆడటం కంటే టీ20 టోర్నీలలో ఆడటానికి అందరూ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఆలోచనతో కొంతమంది క్రికెటర్లు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక క్రికెటర్ ఏకంగా టి20 టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడటం ద్వారా కోట్ల రూపాయలు వస్తాయి అని భావించి ఏకంగా పెళ్లి వేడుకను కూడా వాయిదా వేసుకున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారిపోయింది.

 ఇలా చేసింది ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్. ఇక అతని గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది బిపిఎల్ లో ఫార్చ్యూన్ బరియల్ జట్టుకు చివరి మూడు మ్యాచ్లు ఆడేందుకు డేవిడ్ మిల్లర్కు ఏకంగా 1.24 కోట్ల రూపాయలు చెల్లిస్తాము అంటూ ఆ జట్టు యాజమాన్యం ఆఫర్ ఇచ్చింది. దీంతో అతను పెళ్లిని సైతం వాయిదా వేసుకుని.. చివరికి క్రికెట్ ఆడటానికి వచ్చాడు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈనెల 1వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఆడిన డేవిడ్ మిల్లర్ పదవ తేదీన తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: