రిటైర్ అయ్యేది అప్పుడే.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే తన కెప్టెన్సీ తో ఇక అదరగొట్టేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు సార్లు కూడా టీమ్ ఇండియాను ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు. అయితే రోహిత్ కెప్టెన్సీ చేపట్టిన సమయంలో అతను టెస్ట్ ఫార్మాట్ కి అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఎంతోమంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇక టెస్ట్ ఫార్మాట్లోను అదరగొడుతూ తన కెప్టెన్సీ తో ఇక వరుసగా టెస్ట్ సిరీస్ లు అందిస్తూ దూసుకుపోతూ ఉన్నాడు.

 ఇకపోతే ఇటీవలే అటు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లోను రోహిత్ అదరగొట్టాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలోనే కాదు కెప్టెన్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ఈ సిరీస్ ను 4-1 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు రోహిత్. ఇక తర్వాత జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించబోయేది ఎవరు అంటే ముందుగా రోహిత్ పేరే వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి రోహిత్ రిటైర్మెంట్ పై కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై ఇటీవల రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలం నుంచి రోహిత్ త్వరలోనే రిటైర్ కాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ ఖండించాడు. తాను ఇక ఆడలేనని భావిస్తే వెంటనే క్రికెట్కు దూరంగా ఉంటాను అంటూ రోహిత్ తెలిపాడు  గత రెండు మూడు ఏళ్లలో తన ఆట మరింత మెరుగైనట్లు భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఇప్పట్లో రిటర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదు అన్న విషయాన్ని స్పష్టం చేశాడు కెప్టెన్ రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: