ఒకే ఒక్కడు.. టీమిండియాపై రూట్ అరుదైన రికార్డు?

praveen
క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఉంటాయి. టెస్ట్, వన్డే, టి20 అంటూ మూడు ఫార్మాట్లు కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ క్రికెట్ పుట్టింది మాత్రం టెస్ట్ క్రికెట్ తోనే అని చెప్పాలి. అందుకే ఇక క్రికెట్లో ఎన్ని రకాల ఫార్మాట్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఆటగాడు టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ కాలం పాటు కెరీర్ను కొనసాగించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అలా అని ఇక సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ కాలం కొనసాగడం అనేది అంత సులభమైన విషయం ఏమీ కాదు. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ.. మంచి ఫామ్ కొనసాగించాల్సి ఉంటుంది.

 అందుకే టెస్ట్ ఫార్మాట్లో కేవలం కొంతమంది క్రికెటర్లు మాత్రమే సక్సెస్ అవ్వడం చూస్తూ ఉంటాం. పరిమిత ఓవర్లో ఫార్మాట్లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి  భారీ ఇన్నింగ్స్ లు ఆడే ఆటగాళ్లు సైతం.. టెస్టు ఫార్మాట్లో రాణించలేక విఫలమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే  తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి  అందుకే ఇక సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మట్ లో ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అంటే చాలు ఇక అతనిపై అందరూ ప్రశంసలు కురిపించడం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల ఇంగ్లాండు టీం ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఈ టెస్ట్ సిరీస్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది.

 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న జో రూట్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. భారత జట్టుపై టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు జో రూట్. టీమిండియాతో ఇటీవలే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో జో రూట్ 84 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. జట్టును గెలిపించేందుకు వీరోచితమైన పోరాటం చేశాడు  అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది   అయితే ఈ 84 పరుగుల చేయడం ద్వారా భారత్ పై రూట్ అత్యధిక 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇప్పటివరకు 21 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు రూట్. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 20 సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: