100వ టెస్ట్ మ్యాచ్లో అదుర్స్.. చరిత్ర సృష్టించిన అశ్విన్?

praveen
సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ లో ఎక్కువ కాలం పాటు కెరియర్ని కొనసాగించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఒకవైపు కొత్త ప్రతిభతో దూసుకు వచ్చే యువ ఆటగాళ్ల పోటీని తట్టుకుంటూనే మరోవైపు ఎప్పటికప్పుడు ఫామ్ నిరూపించుకుంటూ  ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే టెస్ట్ క్రికెట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. సుదీర్ఘ కాలం పాటు కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే నేటి జనరేషన్లో ఇలా ఎన్నో ఏళ్ల నుంచి టెస్ట్ ఫార్మాట్లో కొనసాగుతూ లెజెండ్స్ గా ఎదిగిన వారిలో అటు టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 ఎంతో మంది యువ ఆటగాళ్లు తమత ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ ఇక సెలక్టర్లు మాత్రం అశ్విన్ ను కాదని మరొకరిని సెలెక్ట్ చేయలేని విధంగా తన ఆట తీరును కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఇంగ్లాండు, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అశ్విన్. ఇక ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో అయితే ఇక తన కెరియర్లో 100వ టెస్ట్ మ్యాచ్ మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత మాజీలు అందరూ కూడా ఇలా 100వ టెస్టు మ్యాచ్ ఆడిన అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. అయితే 100వ టెస్ట్ మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించాడు అశ్విన్.

 ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్టులో ఏకంగా ఐదు వికెట్లు తీసి అత్యధిక సార్లు ఈ ఘనతను అందుకున్న భారత ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వికెట్ల హాల్ ఎక్కువ సార్లు సాధించిన ఆటగాళ్లలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇకపోతే టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపరిచిన టీమిండియా ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: