అవసరమైతే ఐపీఎల్ కూడా వదిలేస్తా.. సికిందర్ రాజా షాకింగ్ కామెంట్స్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక విదేశీ ఆటగాళ్లు అయితే ఐపీఎల్ ఆడటానికి తెగ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు   ఐపీఎల్ లో ఆడటం కోసం ఏకంగా దేశం తరఫున ఆడే మ్యాచ్లను సైతం వదులుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడితే భారీగా ఆదాయంతో పాటు ఇక ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. అందుకే ఐపీఎల్ మ్యాచ్లను మిస్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.

 ఇలా ఇటీవల కాలంలో చాలామంది ప్లేయర్లు దేశం తరపున ప్రాతినిధ్యం వహించి మ్యాచ్లు ఆడటం కంటే.. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 టోర్నీలలో ఆడేందుకే మొగ్గు చూపుతూ ఉంటే.. మరికొంతమంది క్రికెటర్లు మాత్రం ఏకంగా టి20 కంటే దేశం తరఫున ఆడడమే తమకు ఎంతో ముఖ్యం అంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రాజా కూడా చేరిపోయాడు. ఈ జింబాబ్వే ఆటగాడికి ఐపీఎల్ లో ఆడటం ద్వారా ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో ఒక్క సారిగా స్టార్ గా మారిపోయాడు. అలాంటిది ఐపీఎల్ టోర్నీని కూడా వదిలేసేందుకు నేను సిద్ధమే అంటూ చెబుతున్నాడు సికిందర్ రాజా.

 అవసరమైతే ఐపీఎల్ అయినా వదిలేస్తానేమో.  కానీ జింబాబ్వే జట్టుకు ఆడటం మాత్రం అస్సలు ఆపను అంటూ ఈ స్టార్ ఆల్ రౌండర్ చెబుతున్నాడు. గత రెండు మూడు ఏళ్లుగా నా ప్రదర్శన బాగుంది  కానీ దేశం తరఫున ఆడాల్సి వస్తే ఎలాంటి టోర్నమెంట్ అయిన వదిలేసేందుకు నేను సిద్ధం. చివరికి నైజీరియా లాంటి జట్టుతో మ్యాచ్ ఉన్నా కూడా తాను టి20 టోర్నీలు వదిలేసి దేశం తరపున ఆడటానికి ప్రాధాన్యమిస్తాను. దేశం కోసం ఎలాంటి టి20 టోర్ని అయినా వదిలేస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ సికిందర్ రాజా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: