క్రికెట్ ఫ్యాన్స్ కి పండుగ లాంటి న్యూస్.. T20 వరల్డ్ కప్ ఫ్రీగా చూడొచ్చు?

praveen
ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కళ్ళు కాయలు కాసాల ఎదురుచూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అమెరికా, యూఎస్ఏ వేదికలుగా జరగబోతున్న ఈ ఐసీసీ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా అవతరించాలని ప్రతి జట్టు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ పొట్టి ఫార్మాట్లో ఈసారి ధనాధన్ ఇన్నింగ్స్ లు చూసి మైమరిచిపోవచ్చు అని వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాల పెట్టుకున్నారు అని చెప్పాలి.

 అయితే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు సరైన జట్టును ఎన్నుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి కీలకమైన టోర్నీలు జరిగే సమయంలో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లు ఇక అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెబుతున్నాయ్. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ లను ఎక్కడ చూడాలి ఎలా ఫ్రీగా చూడాలి అని అందరూ అనుకుంటున్న వేళ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

 ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే అంతర్జాతీయ టి20 వరల్డ్ కప్ ను హాట్ స్టార్ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సిద్ధమయింది. వారెవ్వా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ మధ్య పోటీ ఏమో కానీ ఈ పోటీ ప్రేక్షకులకు మాత్రమే బాగా కలిసి వస్తుంది అనిపిస్తుంది కదా. అలా అని సంబరం పడిపోకండి.. ఫ్రీ స్ట్రీమింగ్ విషయంలో కూడా ఒక కండిషన్ పెట్టింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. కేవలం మొబైల్ యాప్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది అని చెప్పాలి. కాగా జూన్ రెండవ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: