1987లో పుట్టిన సమంత ఏజ్.. ఇంకా 23 ఏళ్లేనా?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది సమంత. ఏం మాయ చేసావే అనే సినిమాతో నాగచైతన్యతో జోడి కడ్డీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమానే సూపర్ డూపర్ విజయం సాధించడంతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది. ఇక దశాబ్ద కాలానికి పైకాన్ని ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా చక్రం తిప్పింది సమంత. ఇక ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తూ ఉంది అని చెప్పాలి.

 అయితే మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే సమంతకు కాస్త ఎక్కువగా క్రేజ్ రావడానికి కారణం ఆమె ఎంచుకునే సినిమాలే. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సమంత పాత్ర మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతూ ఉంటుంది. ఆమె అందం అభినయంతో ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంటుంది  అయితే ఇక కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆరేళ్లపాటు ఎంతో జాలీగా గడిపిన ఈ జంట మనస్పర్ధలు కారణంగా చివరికి విడాకులు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక అటు వెంటనే మయోసైటిస్ అనే మాయదారి బారిన పడిన సమంత.  ఇక ఇప్పుడు ఈ వ్యాధి నుంచి కోలుకుని మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టింది

 ఇక ఎప్పటి లాగానే మళ్లీ కసరత్తులు మొదలుపెట్టింది సమంత. ఇకపోతే ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో తన హెల్త్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ని షేర్ చేసుకుంది. కాగా ఈ హెల్త్ డాక్యుమెంట్స్ లో సమంత ఏజ్ వెయిట్ హెల్త్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే సమంత ఏజ్ కేవలం 23 ఏళ్లు అని మాత్రమే ఆ పేపర్లో ఉండడం గమనార్హం. ఇక సమంత వెయిట్ 50 కేజీలు ఉంది. అయితే ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. 1987లో పుట్టిన సమంత ఇంకా 23 ఏళ్ల వయసులోనే ఉన్నారా అని కామెంట్లు నేటిజన్స్. అయితే ఇటీవల చూపించిన డాక్యుమెంట్స్ లో సమంత మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లు అని ఉంది. అయితే మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడానికి అందరూ తెగ వెతికేస్తున్నారు. మెటబాలిక్ ఏజ్ అంటే బాడీ హెల్త్ ని బట్టి మెటబాలిక్ ఏజ్ అసలైన వయస్సు కంటే తక్కువగా ఉండాలి అలాంటప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: