ఆరోజే.. నా కెరియర్ ముగిసిపోయింది అనుకున్నా : అశ్విన్

praveen
టీమ్ ఇండియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అందరు సీనియర్ ప్లేయర్లు కూడా యువ ఆటగాళ్ల రాకతో జట్టులో స్థానం కోల్పోతూ ఉంటే.. అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తన ఆట తీరుతో ఎప్పటికప్పుడు తన స్థానాన్ని టీంలో సుస్థిరం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త ప్రతిభ కంటే అనుభవం గల అశ్విన్ ప్రతిభే మాకు ముఖ్యమని సెలక్టర్లు అనుకునే విధంగా తన ఆట తీరుతో ప్రభావితం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక టీమిండియా జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్రతిసారి కూడా అతను జట్టులో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు.  తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ అదరగొట్టేస్తూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్.

 ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అందుకే అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే చాలు పరుగులు చేయాలనే ఆలోచన పక్కన పెట్టి వికెట్ కాపాడుకోవడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కేవలం బంతితో మాత్రమే కాదు బ్యాట్ తో కూడా అతను బాగా రాణిస్తాడు. జట్టుకు అవసరమైన ఎన్నోసార్లు ఇక బ్యాట్ ఝాలిపించి భారీ స్కోరు చేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా అనుభవజ్ఞుడిగా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఒకానొక సమయంలో మాత్రం కెరియర్ లోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇక జట్టులో చోటు కోల్పోయి నిరాశలో మునిగిపోయాడు.

 అయితే ఇటీవలే ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు అశ్విన్. ఈ క్రమంలోనే తన కెరీయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ 2018 - 19 కాలంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ గా ఉన్నాను. కానీ ఆకస్మాత్తుగా జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడే నా కెరియర్ ముగిసిపోయింది అని అనుకున్నాను. కానీ ఎవరివల్ల జరిగింది అనేది చెప్పలేను. ఇలా జరిగిన తర్వాత సినిమాలు చూడటం నిద్రపోవడం ఇదే పనిగా పెట్టుకున్న. కానీ ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి ఇప్పుడు క్రికెట్ ని మళ్ళీ ఆస్వాదిస్తున్న అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: