పదహారేళ్ల కెరియర్లో.. మొదటిసారి అలా ఔటైన రహానే?

praveen
అజింక్య రహానే.. ఇతని గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే పెద్దగా జట్టులో అవకాశాలు దక్కించుకోవట్లేదు. కానీ ఒకప్పుడు మాత్రం భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన అతను పేరు తప్పకుండ కనిపించేది. ఇక అతను తన ఆట తీరుతో భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహించేవాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగిన సమయంలో టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీకి డిప్యూటీగా కూడా పనిచేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కోహ్లీ లీవ్ లో ఉండగా.. తన కెప్టెన్సీ తో మరపురాని విజయాలను కూడా అందించాడు రహానే. ఇక టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అని ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకున్నాడు అని చెప్పాలి.

 ప్రొఫెషనల్ క్రికెటర్ అనే పదానికి అతను కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఇతరులతో గొడవ పడటం కానీ.. క్రికెట్ రూల్స్ అతిక్రమించడం కానీ అస్సలు చేయడు అని చెప్పాలి. అయితే అలాంటి అజింక్య రహానే గత కొంతకాలం నుంచి మాత్రం టీమిండియాకు పూర్తిగా దూరమైపోయాడు. యువ ఆటగాళ్ల రాకతో సెలెక్టర్లు ఈ సీనియర్ ప్లేయర్ ను పట్టించుకోవట్లేదు. అయితే ప్రస్తుతం పట్టు విడవని విక్రమార్కుడిలా రంజీ ట్రోఫీలో ఆడుతూ మళ్లీ ఫామ్ లో నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు అజింక్య రహానే తన 16 ఏళ్ల క్రికెట్ కెరియర్ లో ఎన్నోసార్లు వివిధ రకాలుగా ఔట్ అయ్యాడు.

 కానీ 16 ఏళ్ల కెరియర్ లో మొదటిసారి ఎప్పుడూ జరగని విధంగా ఊహించని రీతిలో వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. తొలిసారిగా ఫీల్డ్ ను అడ్డుకున్నందుకు అతను ఔట్ అయ్యాడు. అస్సాం, ముంబై మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపైర్  అవుట్ ఇచ్చిన వెంటనే వచ్చిన టీ బ్రేకులో అస్సాం జట్టు తమ నిర్ణయాన్ని మార్చుకుంది. రహనెను వెనక్కి పిలవాలి అంటూ అంపైర్లను కోరింది. దీంతో ఇక బ్రేక్ ముగిసిన అనంతరం అంపైర్లు రహానేను వెనక్కి పిలిపించారు. అయితే ఆ తర్వాత కాసేపు మాత్రమే క్రీజులో నిలబడిన రహానే 22 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: