బ్యూటీ పార్లర్ పెట్టాడు.. కానీ అక్కడికొచ్చిన మహిళలను?

praveen
ఇటీవల కాలంలో సభ్యసమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి సమాజంలో మంచి మనుషుల కంటే ఇక కుళ్ళు కుతంత్రాలను లోపల పెట్టుకుని బయటికి మరోలా కనిపిస్తున్న మనుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నీతి నిజాయితీ అంటూ ఎంతో పద్ధతిగా బ్రతికేవారు. కానీ నేటి రోజుల్లో ఏకంగా ఎదుటి వాడిని మోసం చేసి ఏదో ఒక విధంగా బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా బ్రతికేస్తూ ఉన్నారు. ఇక ఇలా వచ్చిన దాంతో జల్సాలు చేయాలని ఎంతో మంది ఆశ పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ఎప్పుడు ఎవరు ఎలా మోసం చేస్తారు అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎంతోమంది  సైబర్ నెరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చివరికి భారీగా డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి మోసానికి సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది నిరుద్యోగ మహిళలు ఏదో ఒక విషయంలో శిక్షణ తీసుకొని ఉపాధి పొందాలని అనుకుంటున్నారు. ఇలాంటి వాటిలో బ్యూటీ పార్లర్ కోచింగ్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక్కడ ఒక వ్యక్తి బ్యూటీ పార్లర్ పెట్టాడు. ఏకంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తాను అంటూ నమ్మించటం మొదలుపెట్టాడు. చివరికి నిరుద్యోగ మహిళలను టార్గెట్గా చేసుకొని మోసగించాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తిని ఇటీవల మెదక్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఇస్మాయిల్ తమ బంధువులు స్నేహితులు కొందరుతో కలిసి హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాలలో నిరుద్యోగ మహిళల నుంచి బ్యూటీ పార్లర్ కోచింగ్ ఇప్పిస్తానని చెప్పి 300000 చొప్పున తీసుకొని మోసం చేశాడు. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఇక ఇస్మాయిల్ ను అరెస్టు చేశారు. అతనితోపాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: