
నీ భార్యను ప్రేమిస్తున్నానన్న నేటిజన్.. ప్యాట్ కమిన్స్ అదిరిపోయే రీప్లే?
ఎందుకంటే ఎంతోమందికి సెలబ్రిటీలు ఏకంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా చీట్ చాట్ సెషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇలా అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా డైరెక్ట్ గా సమాధానాలు చెప్పేస్తున్నారు ఎంతో మంది సెలబ్రిటీలు. అయితే ఇలా చిట్ చాట్ సెషన్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలకి అభిమానుల నుంచి ఊహించని రీతిలో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చిరాకెత్తించే ప్రశ్నలతో కోపం తెప్పిస్తూ ఉంటారు నేటిజన్స్.
అయితే ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు కొంతమంది ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. ఇంకొంద మంది మాత్రం ఎంతో కూల్ గా సమాధానం చెప్పి పిచ్చి ప్రశ్న అడిగిన వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు ఇటీవల ఆస్ట్రేలియా కెప్టెన్ గా కొనసాగుతున్న ఫ్యాట్ కమిన్స్ సైతం ఇలాగే ఒక నేటిజెన్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు ఏకంగా ఇటీవల ప్యాట్ కమిన్స్ ఇంస్టాగ్రామ్ లో తన భార్యతో దిగిన ఫోటోని పోస్ట్ చేయగా.. ఒక నెటిజన్ ఊహించని కామెంట్ చేశాడు. నేను భారతీయుడిని.. నీ భార్యను ప్రేమిస్తున్నాను అంటూ కామెంట్ రాసుకోచ్చాడు. అయితే దీనిపై స్పందించిన కమిన్స్. ఈ విషయాన్ని నా భార్యకు తెలియజేస్తాను అంటూ ఎంతో కూల్ గా సమాధానం ఇచ్చి కౌంటర్ ఇచ్చాడు. ఈ రిప్లై చూసి ఇది ఆస్ట్రేలియా స్టైల్ అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.