ఫైనల్లో ఓడిపోవడానికి.. అసలు కారణం అదే : కెప్టెన్ ఉదయ్

praveen
ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్లు చూస్తూ ఉంటే టీమిండియాకు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కాదు ఆస్ట్రేలియానేమో అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే భారత జట్టు అద్భుతంగా రాణించిన ప్రతిసారి కూడా ఆస్ట్రేలియానే చావు దెబ్బ కొడుతుంది. ఏకంగా వరల్డ్ కప్లలో అయితే ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే చాలు భారత్ వణికి పోతుందేమో అనే విధంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఎనిమిది నెలల కాలంలో మూడు ఐసీసీ ట్రోఫీలలో భారత జట్టును దెబ్బ కొట్టింది ఆస్ట్రేలియా జట్టు.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విశ్వవిజేతగా నిలుస్తుంది అనుకున్న టీమ్ ఇండియాను ఓడించి.. భారత్ క్రికెట్ ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది. ఆస్ట్రేలియా ఇక గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలోను ఇదే రిపీట్ అయింది. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో అయినా కనీసం భారత యంగ్ టీమ్ ఇండియా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్ లో మరోసారి భారత జట్టును ఓడించింది ఆస్ట్రేలియా. దీంతో ఆరోసారి టైటిల్ ని సొంతం చేసుకోవాలనే కల ఇండియాకు కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి.

 అప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చిన టీమిండియా తుది పోరులో బోల్తాపడటం అభిమానులు అందరిని కూడా నిరుత్సాహానికి గురి చేసింది. ఫైనల్లో ఓడిపోవడంపై భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ స్పందించాడు. మెగా టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఫైనల్ లో గెలిచి ఉంటే మరింత సంతృప్తిగా ఉండేది. తుదిపోరులో కొన్ని చెత్త షాట్లను ఆడి వికెట్లను సమర్పించుకున్నాం. క్రీజు లో ఎక్కువ సమయం గడపలేకపోయాం. దీంతో ఇక మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ కు సన్నతమైనప్పటికీ ప్రణాళికలు సరిగా అమలు చేయలేకపోయాం. కానీ ఈ ప్రపంచకప్ టోర్ని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్న. భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: