టైటిల్ నెగ్గిన సన్రైజర్స్.. ఐపీఎల్ లోను ఇదే ఊపు కొనసాగిస్తుందా?

praveen
2024 ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ ఐపిఎల్ టోర్నీలో పాల్గొనబోయే 10   జట్లు కూడా టైటిల్ విజేతగా నిలవడమే  లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఎన్నో జట్లు ఇక టీమ్ లో ఉన్న కొంతమంది ఆటగాళ్ళను వదిలేయ్యడమే కాదు జట్టుకు ఉపయోగపడతారు అనుకున్న కొంతమంది ప్లేయర్లను ఇక భారీ ధర పెట్టి కొనుగోలు చేశాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు టైటిల్ గెలవడమే లక్ష్యంగా 2024 ఐపీఎల్ సీజన్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. అయితే ఇక మార్చ్ నెలలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి అటు ఐపిఎల్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మాత్రం ఒక్క సీజన్లో కూడా సరిగ్గా కలిసి రావడం లేదు. జట్టులో ఉన్న ఆటగాళ్లను మాత్రమే కాదు జట్టు కెప్టెన్లను మార్చిన కూడా ఈ జట్టుకు అదృష్టం మాత్రం వరించడం లేదు. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లో 2016లో ఐపీఎల్లో సన్రైజర్స్ టీం టైటిల్ విజేతగా నిలిచింది. అప్పటినుంచి మరో ట్రోఫీ దక్కలేదు.

 అయితే ఇలా ఐపీఎల్లో విఫలమైతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో మాత్రం అదరగొట్టేస్తుంది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు ట్రోఫీలు గెలిచింది అని చెప్పాలి. ఇక ఇదే ఊపులో 2024 ఐపీఎల్ కూడా సన్రైజర్స్ గెలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో టైటిల్ గెలిపించిన కెప్టెన్ మార్కరమే ఇక ఇప్పుడు అటు ఐపీఎల్ లో కూడా సన్రైజర్స్ జట్టును సారథిగా ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ఉన్న మ్యాజిక్ నే ఐపీఎల్ లో కూడా రిపీట్ చేయాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: